ఇదే నిజం,గొల్లపల్లి : మాలల సింహగర్జన డిసెంబర్ 1న విజయవంతం చేయాలని మాలలంతా ఏకమై అందరూ కలిసికట్టుగా మాల జాతి కులస్తులకు మన ఐక్యత కోసం మరో ఉద్యమానికి నాంది పలకాలని రాజ్యాంగ హక్కులను కాల రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దు. మన మాలల హక్కుల పరిరక్షణ కోసం యుద్ధమించుదాం. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగ హక్కులు కాపాడుకునీ మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం.ఈ నేపథ్యంలోనే దళితులను విభజించే హక్కు అధికారం ఎవరికి లేదని జాతీయ ఎస్సీ /ఎస్టీ కమిషన్ కూడా స్పష్టం చేసింది. చంద్రబాబు తెచ్చిన వర్గీకరణ ఆర్డినెన్స్ 341ఆర్టికల్ రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ కొట్టేసింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న కేవలం పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది. కానీ ఇదే సుప్రీంకోర్టు తిరిగి 20 ఏళ్ల తర్వాత ఎస్సీలను వర్గీకరించి అంశాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తూ 01 ఆగస్టు 2024 నాడు తీర్పు ఇచ్చింది ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఇదే సుప్రీంకోర్టు ఒకసారి రాజ్యాంగ విరుద్ధమని చెప్పి తిరిగి 20 ఏళ్ల తర్వాత వర్గీకరణ చేయవచ్చు అని చెప్పింది అంటే ఒకే సుప్రీంకోర్టు ఒకే కేసులో రెండు రకాల తీర్పు ఇచ్చిందన్నమాట అందుకే ఈ తీర్పును ముమ్మాటికి రాజకీయ ప్రోద్బలంతో ఇచ్చిన తీర్పు గానే దళితులు భావిస్తున్నారు.
ఈ దేశంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో జరిగిన (ఎం ఆర్ పి ఎస్)ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ బహిరంగనే హామీ ఇచ్చారు. మరి మనం మాల జాతి బిడ్డలం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రిజర్వేషన్లు కాపాడుకుందాం. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు ,ఇంజనీర్లు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమై కదలండి మేలుకోండి కదం తొక్కండి. ఇది మాలల ఆత్మగౌరవ సభ.30 సంవత్సరాల క్రితం పివి రావు చేసిన ఉద్యమానికి మరో నాంది పలుకుదాం. గ్రామవాడల నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి మండల నుండి జిల్లా నలుమూలల నుంచి హైదరాబాద్ డిసెంబర్ 1న పెరేడ్ గ్రౌండ్లో జరిగే సభను విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సూరమల్ల సతీష్ పిలుపునిచ్చారు.