Warangal : వరంగల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాదిగ వర్గానికి చెందిన మారెపల్లి సుధీర్ కుమార్ పోటీ చేయనున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో సుధీర్ కేసీఆర్‌ను కలిశారు. ప్రస్తుతం సుధీర్ కుమార్ హన్మకొండ జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మొదట్నుంచీ సుధీర్ బీఆర్‌ఎస్ లోనే ఉన్నారు. చివరివరకూ టికెట్ తనకే వస్తుందని ఆశగా ఉన్న తాటికొండ రాజయ్యకు నిరాశ ఎదురైంది.