Summer Holidays : తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న కళాశాలలు తిరిగి తెరుచుకుంటాయని విద్యా శాఖ ప్రకటించింది. అధిక ఎండల నేపథ్యంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులు ప్రకటించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.