Summer Holidays : ఏపీ విద్యార్థులకు పండుగ లాంటి వార్త వచ్చేసింది. విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈసారి ఏకంగా 48 రోజులు సమ్మర్ హాలీడేస్ రానున్నాయి. ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరవబడతాయి. బుధవారం అన్ని పాఠశాలలకు ఈ సంవత్సరం చివరి పనిదినం. వేసవి సెలవులు ప్రకటించడంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెలవుల్లో కుటుంబ సమేతంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు తల్లిదండ్రులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.