Homeహైదరాబాద్latest NewsSummer Safety Tips: మండే ఎండల్లో ఆరోగ్యం జాగ్రత్త.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!

Summer Safety Tips: మండే ఎండల్లో ఆరోగ్యం జాగ్రత్త.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!

Summer Safety Tips: ఎండలు ఎకువగా ఉండటంతో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లతో పాటు పెద్దవారు కూడా డీహైడ్రేటెషన్‌ సమస్యల బారిన పడతారు. అయితే ఇలాంటి సమస్య బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు సమ్మర్ ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల శరీరంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరు బయట పనిచేసే వారు ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. తరుచూ నీళ్లు తాగాలి. ఎకువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తెలుపు రంగు, లేత రంగులు పలుచని కాటన్‌ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img