HomeసినిమాSunil Role in Shankar New Movie : శంక‌ర్ కొత్త సినిమాలో సునీల్ పాత్ర‌...

Sunil Role in Shankar New Movie : శంక‌ర్ కొత్త సినిమాలో సునీల్ పాత్ర‌ ఎలా ఉంటుందో తెలుసా

Sunil Role in Shankar New Movie : స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ టాలీవుడ్ (Tollywood) హీరో రాంచ‌ర‌ణ్ (Ram Charan) తో 15 (RC15) వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక‌ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది.

శంక‌ర్ అండ్ టీం విడుద‌ల చేసిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ గురించే ఇపుడు అంతా చ‌ర్చించుకుంటున్నారు.

తాజా పోస్ట‌ర్ లో ఉన్న క‌మెడియ‌న్ క‌మ్ హీరో గురించి ఓ వార్త తెర‌పైకి వ‌చ్చింది.

అత‌డెవ‌రో ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త వ‌చ్చి ఉంటుంది. ఈ చిత్రంలో సునీల్ (Sunil)ను కీల‌క పాత్ర‌లో తీసుకున్నాడు శంక‌ర్‌.

తాజాగా ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌ల ప్ర‌కారం (RC15)లో సునీల్ పాత్ర నిడివి బాగానే ఉంటుంద‌ట‌.

అంతేకాదు ఈ పాత్ర‌లో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ట‌. హీరోగా స‌రైన హిట్స్ లేని సునీల్ గ‌త రెండేళ్లుగా యూ ట‌ర్న్ తీసుకున్నాడు.

క‌థాబ‌లమున్న పాత్ర‌ల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో శంకర్ సినిమాలో అవ‌కాశం కొట్టేయ‌డంతో..ఇపుడు అంద‌రి చూపు సునీల్ పైనే ఉంది.

మ‌రి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న RC15లో సునీల్ ను శంక‌ర్ ఎలా చూపించ‌బోతున్నాడ‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

ఈ చిత్రంలో కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ లో న‌టిస్తోంది. అంజ‌లి, జ‌య‌రామ్, న‌వీన్ చంద్ర ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img