Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీద అడుగుపెట్టారు. సునీత, బుచ్ విల్మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్తో ‘క్రూ డ్రాగన్ వ్యోమనౌక’ తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. గతేడాది జూన్లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. దీంతో 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయారు.
సునీతకు ప్రముఖుల స్వాగతం
వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి రాకపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భారత్‌లో పలువురు కేంద్రమంత్రులు వ్యోమగాములకు వెల్‌కమ్ చెబుతూ పోస్ట్‌లు చేశారు.‘సునీత అద్భుత ప్రయాణం, అచంచలమైన అంకిత భావం, ధైర్యం, పోరాట పటిమ.. పలువురికి స్ఫూర్తిదాయకం’ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘భారత పుత్రిక రాకను యావత్ ప్రపంచం వేడుకగా చేసుకుంటోంది’ అని జితేంద్ర సింగ్ అన్నారు.