Homeహైదరాబాద్latest Newsమాల్దీవుల్లో సన్నీలియోన్ మళ్లీ పెళ్లి..! వరుడు ఎవరో తెలిస్తే షాక్ ..?

మాల్దీవుల్లో సన్నీలియోన్ మళ్లీ పెళ్లి..! వరుడు ఎవరో తెలిస్తే షాక్ ..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్ మళ్లీ పెళ్లి చేసుకుంది. సన్నీలియోన్ ఒక వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు సేవా కార్యక్రమాలను చేస్తూ తన మంచితనాన్ని చాటుకుంటుంది.అయితే సన్నీ 2011లో అమెరికాకు చెందిన డేనియల్ వెబర్‌ను పెళ్లాడారు. కొంత కాలం తర్వాత ఆ దంపతులు నిషా అనే అనాథను దత్తత తీసుకుని సొంత బిడ్డలా పెంచుకున్నారు. తరువాత వారికి ఆషేర్ మరియు నోవహు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఇలా భర్త, పిల్లలతో జీవితాన్ని సాగిస్తున్న సన్నీలియోన్ రెండో పెళ్లికి సిద్ధమైందంటూ నెట్ లో ఓ వార్త వైరల్ అవుతోంది.
అయితే ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి వేరే వ్యక్తిని పెళ్లాడిందని మీరు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆమె ఇప్పుడు తన భర్తతో వివాహం చేసుకోబోతోంది. ఇటీవలే పెళ్లయి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సన్నీలియోన్ తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగా భర్త, పిల్లలతో సరదాగా గడుపుతోంది. తాజాగా తెల్లటి దుస్తుల్లో రెడీగా ఉన్న సన్నీ, డేనియల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పెళ్లి ఫోటోలో సన్నీలియోన్ మెరిసింది. పిల్లల సమక్షంలో భర్తను మరోసారి పెళ్లాడాలని ఉద్దేశంతో చేసుకుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img