Sunrisers Hyderabad : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు వైజాగ్ లోని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. కేవలం అనికేత్ వర్మ మాత్రమే 74 పరుగులే చేసి రాణించాడు. హెన్రిచ్ క్లాసెన్ 32, ట్రావిస్ హెడ్ 22 పరుగులతో పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ నిర్ణీత 18.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.