Idenijam, webdesk : గత రెండేళ్ల నుంచి ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్‌లో టాప్ 5 అత్యధిక స్కోర్లలో ఈ సీజన్లోనే 4 రికార్డులు నమోదవడం విశేషం. ఈ తరహా స్కోర్లు వన్డే క్రికెట్లో ఒకానొక సమయంలో మ్యాచ్ విన్నింగ్ స్కోర్లుగా ఉండేవి. నిన్న జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించడంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఆ జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. రికార్డులు ఉన్నది చెరిపేయడానికే అన్నట్లు తన రికార్దులను తాానే తిరగరాస్తోంది. టీ20లో 300 పరుగుల మైలురాయిని చేరుకునే మొదటి జట్టు హైదరాబాద్ సన్‌రైజర్స్ మాత్రమే అవుతుందని SRH ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. తమ డ్యాషింగ్ బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్‌కు కొత్త ఆటతీరును ప్రపంచానికి పరిచయం చేస్తోంది సన్‌రైజర్స్.
చాలామంది హైదరాబాదీలు తమ హోంటీంను కాకుండా ఇతర జట్లకు మద్దతు ఇవ్వడాన్ని చూశాం. మ్యాచ్ నిర్వహణ, సౌకర్యాలు, రాజకీయాలు తదితర కారణాల వల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పుకోదగ్గ గుర్తింపు దక్కించుకోకపోవడానికి ప్రధాన కారణం. ఇటీవలే మ్యాచ్ టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగానే HCA తీరును తప్పుబట్టారు. తెలుగు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ఆడుతున్న తీరును చూసి మిగతా 9 జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అంటేనే ఓటమి ఖరారైనట్లుగా లెక్కలేసుకునేలా మర్చేసింది SRH. దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఆట తీరు గురించి విశ్లేషకులు, ప్రముఖుల చెవుల్లో మారుమ్రోగుతోంది. ఇటువంటి తరుణంలో HCAను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దితే హైదరాబాద్‌కు, ఇండియన్ క్రికెట్‌కు ఇంకా మంచి పేరు వస్తోందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కూడా కూల్ అవుతారు. ఆరెంజ్ ఆర్మీకి పాలోయింగ్ పెరుగుతుంది.