సన్‌రైజర్స్ మరోసారి దుమ్ముదులిపింది. హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఆదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. హెన్రిక్ క్లాసీన్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. నటరాజన్, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. SRH పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. అభిశేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.
కేకేఆర్, ఆర్‌ఆర్ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే సెకండ్ ప్లేస్‌కి వెళ్తుంది . వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా, ఓడిపోయినా మూడో స్థానానికే పరిమితమవుతుంది. సన్‌రైజర్స్ రెండో స్థానంలోనే ఉంటుంది. ప్లే ఆఫ్స్‌కు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్, బెంగళూరు జట్లు క్వాలిఫై అయ్యాయి.