సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరిగిపోతున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ వెల్లడించింది. దీంతో చరిత్రలో అత్యంత వేడి సంవత్సరాల్లో తొలి ఐదు స్థానాల్లో 2024 నిలుస్తున్నట్లు తెలిపింది. 2023 జూన్ నుంచి 2024 మార్చి వరకు రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు పేర్కొంది. ఇక ఏప్రిల్ అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కిందని వివరించింది