Homeహైదరాబాద్latest Newsతిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ ఛాన్స్ ..24న వేలం.. ఏ ఏ వస్తువులు వేలం వేస్తున్నారంటే..?

తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ ఛాన్స్ ..24న వేలం.. ఏ ఏ వస్తువులు వేలం వేస్తున్నారంటే..?

తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం విపరీతంగా భక్తులు వస్తుంటారు. తమ మొక్కుల సమర్పణకు కొందరు భక్తులు రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుంటే మరి కొందరు భక్తులు నడకమార్గం వెంకన్న సన్నిధికి చేరుకుంటారు.వీరంతా స్వామివారి హుండీలో తమకు తోచినంత, తమకు చేతనైనంత కానుకలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు.హుండీ లో భక్తులు సమర్పించిన వస్తువుల్లో ఫోన్లు, వాచీలు కొత్తవాటితోపాటు వాడినవాటిని కూడా వేలం వేయనున్న తిరుమల తిరుపతి దేవస్థానం. ఈనెల 24వ తేదీన పోర్టల్ ద్వారా ఈవేలం ప్రక్రియ జరగబోతోంది. ఆసక్తి ఉన్నవారు ఇందులో పాల్గొని వీటిని సొంతం చేసుకోవచ్చు. టైటాన్, క్యాషియే, ఆల్విన్, టైమెక్స్, సోనాటా, ఫాస్ట్ ట్రాక్ కంపెనీలకు చెందిన వాచీలతో పాటు, నోకియా, శామ్ సంగ్, వివో, మోటరోలా వంటి బ్రాండ్లకు చెందిన సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img