HomeసినిమాUS​లో ‘హాయ్​ నాన్న’కు సూపర్ క్రేజ్

US​లో ‘హాయ్​ నాన్న’కు సూపర్ క్రేజ్

టాలీవుడ్​ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్​ బాబు తర్వాత ఓవర్సీస్ మార్కెట్​లో మిలియన్ డాలర్ల వసూళ్లు ఉన్న సినిమాల్లో నాని సెకండ్ ప్లేస్​లో ఉన్నారు. ఇప్పటివరకు నాని నటించిన 8 సినిమాలు యూఎస్ బాక్సాఫీసు వద్ద వన్ మిలియన్ డాలర్ల మార్క్​ను దాటాయి. నాని తాజా సినిమా ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ప్రమోషనల్ మెటీరియల్​ను బట్టి చూస్తే హాయ్​ నాన్న ఓవర్సీస్​ ఆడియెన్స్​ను ఆకట్టుకుంటుందనే తెలుస్తోంది. యూఎస్​లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. హాయ్ నాన్న రిలీజ్​కి దాదాపు ఒక వారం మిగిలి ఉండగానే దాని ప్రీ సేల్స్ ద్వారా దాదాపు 25కే డాలర్లను నమోదు చేసింది. ఇది మంచి స్టార్ట్ అని చెప్పాలి. రాబోయే రోజుల్లో ప్రీ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అతి త్వరలో, నాని తన అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ, యూఎస్​లోనే ఈ మూవీని ప్రమోట్ చేయనున్నారు. హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా నటించింది. శౌర్యువ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img