Homeహైదరాబాద్latest Newsసూపర్ స్టార్ పుట్టినరోజన కీర్తి సురేష్ పెళ్లి..! క్లారిటీ ఇచ్చిన మహానటి

సూపర్ స్టార్ పుట్టినరోజన కీర్తి సురేష్ పెళ్లి..! క్లారిటీ ఇచ్చిన మహానటి

సౌత్ ఇండియన్ సినిమాలో ప్రముఖ హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు తెచ్చుకుంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తన చిరకాల స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తటిల్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. తాజాగా తన పెళ్లి పై కీర్తి సురేష్ కీలక అప్డేట్ ఇచ్చింది. ‘KA వెడ్డింగ్ స్టార్ట్స్’ అనే క్యాప్షన్‌తో గోవా విమాన టిక్కెట్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన పెళ్లి గోవాలో జరుగుతుందని కీర్తి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 12న వీరి వివాహం జరగనుంది.తమిళ స్టార్ హీరో రజనీకాంత్ పుట్టినరోజున వీరి వివాహం జరగడం విశేషం. కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగనుందని సమాచారం.

Recent

- Advertisment -spot_img