Homeతెలంగాణవరద బాధితులను ఆదుకోండి.. సీపీఐ

వరద బాధితులను ఆదుకోండి.. సీపీఐ

హైదరాబాద్​ : రాష్ట్ర వ్యాపితంగా గత వారం రోజులుగా ఎడతెరపు లేకుండా పడుతున్న వర్షాల కారణంగా మృత్యువాత పడిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గందేడు మండలం, పగిడాల గ్రామంలో మిద్దె ఇళ్ళు కూలి శరణమ్మతో పాటు ఆమె ఇద్దరు కూతురులు భవాని, వైశాలి చనిపోయారు. ఇది దురదృష్టకరమైన సంఘటన. దాదాపు రాష్ట్రంలో చాలా వరకు ఇంగ్లలోకి వర్షపు నీరు వచ్చి నిత్యావసరాలు తడిచి కనీసం తిండి లేక పస్తులుండే పరిస్థితి దాపురించింది. వరంగల్‌ నగరంలో చాలా కాలనీలు ఇప్పటికి జలదిగ్భంధనంలోనె వున్నాయి. ప్రధాన రహదారులు అన్నియూ వరదలకు కొట్టుకవోయి అస్తవ్యస్తంగా మారింది. చెరువులకు గండ్లు పడి ఊర్లను ముంచెత్తాయి. వరి పంట నష్టపోయిన వారికి రూ.20 వేలు నష్టపరిహారం, పూర్తిగా ఇండ్లు కూలిపోయిన వారికి రూ. 10 వేలు, పాక్షికంగా కూలి పోయిన వారికి రూ. 5వేలు, డబుల్‌ బెడ్​ రూమ్‌ ఇండ్లు, తక్షణమే అందించాలని చాడ డిమాండ్​ చేశారు.

అనేక బలహీనవర్గాల కాలనీలు నీళ్ళలో చిక్కిపోయినందున, నిత్యావసర వస్తువులు అందజేయాలని చాడ విజ్ఞప్తి చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి దాక్టర్‌ నారాయణ నాయకత్వంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, తక్కళ్ళపలి శ్రీనివాస్‌ వరంగల్‌, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాలో వరద నప్టాలను పరిశీలించడానికి వెళ్తున్నారు.

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల డిపాజిట్‌లకు వడ్డీ చెల్లించాలి:

ఆర్టీసిలో దాదాపు 15000 మంది విశ్రాంతి ఉద్యోగుల డిపాజిట్లపై ఆగస్టు వడ్డి చెల్లించక పోవడం దారుణం అన్నారు చాడ. విశ్రాంతి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న సమయంలో జీతాలలో నుంచి కొంత మొత్తం మినహాయించి సహకార పరిపతి సంఘంలో డిపాజిట్‌ రూపంలో దాచుకున్న డబ్బు రూ.370 కోట్లు, వాటిపై నెలకు రూ. 4. 5 కోట్లు చెల్లించాలి, సీసీఎస్‌ నిధుల నుంచి దాదాపు రూ. 740 కోట్ల రూపాయలను ఆర్టీసి వాడుకున్నది. దానికి సంబంధించిన రూ. 140 కోట్ల వడ్డి పేరుకుపోయింది. ఆగస్పు నెలకు సంబంధించి విశ్రాంతి ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డి ఇవ్వకపోవడంతో కరోనా కష్టకాలంలో వృద్దుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. వెంటనే ఆర్టిసి వాడుకున్న వడ్డీ డబ్బులు చెల్లించాలని సీపీఐ డిమాండ్​ చేస్తుందని చాడ అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img