Homeజిల్లా వార్తలుసుప్రీంకోర్టు తీర్పు విచారకరం

సుప్రీంకోర్టు తీర్పు విచారకరం

– ప్రజలు సంతోషంగా లేరు
– డెమోక్రటిక్​ ప్రోగ్రెసివ్​ ఆజాద్​ పార్టీ చైర్మన్​ గులాం నబీ ఆజాద్​
– శాంతిభద్రతలకు విఘాతం కల్పించం : ఓమర్​ అబ్ధుల్లా

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఆర్టికల్​ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు విచారకరమని డెమోక్రటిక్​ ప్రోగ్రెసివ్​ ఆజాద్​ పార్టీ చైర్మన్​ గులాం నబీ ఆజాద్​ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు పట్ల కశ్మీర్​ ప్రజలెవరూ సంతోషంగా లేరని చెప్పారు. ఆర్టికల్​ 370 రద్దును సమర్థిస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఓమర్​ అబ్ధుల్లా స్పందించారు. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. ఇక ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ కూటమిగా జమ్ము-కశ్మీర్ పార్టీలు ఏర్పడ్డాయి. ఇక ఈ తీర్పు సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని స్పష్టం చేసింది. కశ్మీర్​ భారత్‌లో అంతర్భాగం అయినపుడు ప్రత్యేక హోదాలేమీ లేవని పేర్కొంది. ఈ తీర్పుపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కశ్మీర్​లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img