టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అట్టు రాజకీయాలు.. ఇట్టు సినిమాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘ఓజి’, ‘హరి హర వీర మల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. సినిమాలు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ ఒక సినిమాకి సంతకం చేసాడు. ఒక మంచి కమర్షియల్ కథను సురేందర్ రెడ్డి సిద్ధం చేశారు. స్క్రిప్ట్ కూడా రెడీ అయింది.
కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు.కానీ పవన్ రాజకీయాలతో వేరే సినిమాలతో బిజీ కావడం..సురేందర్ రెడ్డి మధ్యలో అఖిల్‌తో ఏజెంట్ మూవీ తెరకెక్కిండం వలల్ ఆలస్యమైంది. ఇప్పట్లో అయితే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు అని నిర్మాత రామ్ తాళ్లూరి అన్నారు. మరోవైపు సురేందర్ రెడ్డి మరో కొత్త కథను సిద్ధం చేశాడని, త్వరలోనే ఆ కథను ఓ పెద్ద హీరోకి చెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నామని రామ్ తాళ్లూరి తెలిపారు.