Surgical strike : జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై భారతీయుల రక్తం మరిగిపోతోంది. కశ్మీర్ పర్యాటకులను పాకిస్థాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేసి హతమార్చారు. ఈ దాడిలో 30 మంది చనిపోయారు. అయితే పహల్గామ్ దాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్థాన్ చెబుతూనే.. భారత సరిహద్దు వెంబడి భారీ సంఖ్యలో సైనికులను మోహరిస్తోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించినట్లు సమాచారం. అయితే మరోసారి పాకిస్థాన్‌పై ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేయనుంది అని సమాచారం. ఈరోజు ఇండియాకి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్సింగ్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పుడు దేశం మొత్తం పహల్గామ్ దాడికి ప్రతిదాడిని డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్‌పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలో రాబోయే 10-15 రోజుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతిదాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో, నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో పాకిస్తాన్‌పై రెండు పెద్ద సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. 2016లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై, 2019లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది.