97వ ఆస్కార్ బరిలో ఉత్తమ సినిమా విభాగంలో సూర్య ‘కంగువ’ పోటీ పడనుంది. కోలీవడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ‘కంగువ’. ఈ సినిమాలో సూర్యకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాలు మధ్య విదుదలై డిజాస్టర్ గా నిలిచింది. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 180 కోట్ల మాత్రమే వసూలు చేసింది. తాజాగా ఈ సూర్య ‘కంగువ’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.
2025 ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 323 సినిమాలు పోటీ పడ్డాయి, వాటిలో 207 సినిమాలు నామినేట్ అయ్యాయి. భారత్ నుండి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో.. కంగువ (తమిళం), ఆడుజీవితం (ది గోట్ లైఫ్) (హిందీ), సంతోష్ (హిందీ), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ (మలయాళం-హిందీ) గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ-ఇంగ్లీష్)