ఇదే నిజం, బొల్లారం : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని కుడి కుంట ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. సర్వే నెంబర్ 132 లోని కుడి కుంట ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ పరిధిలోను గుర్తిస్తూ అధికారులు సర్వే చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో సర్వేయర్ రామభద్రం ఇరిగేషన్ ఏఈ దిలీప్, టౌన్ ప్లానింగ్ అధికారి పవన్, అసిస్టెంట్ సత్యనారాయణ మున్షి, నవీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.