తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ డిజిటల్ సర్వేలో భాగంగా ఎమ్మార్వోలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. వివరాలను సేకరించి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు ద్వారా నమోదు చేస్తారు. అయితే మొదటగా తమ అధికారులు ఇంటికి వెళ్లగానే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంత మంది సభ్యుల ఆధార్ కార్డులు, లేదంటే ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని తమ అధికారులు అడిగిన కుటుంబ వివరాలు తెలియజేయాలి. దీంతో పాటు ఫ్యామిలీ డిజిటల్ ఫోటో తీయనున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన డిజిటల్ కార్డు సర్వే ద్వారా రేషన్ బియ్యం కొనాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా భవిష్యత్తులో డిజిటల్ కార్డు ఉంటే చాలు.. కార్డు ఉన్నా లేకపోయినా ఈ ఒక్క కార్డు చాలు.