హైదరాబాద్ః భార్యాభర్తల బంధం అంటే తెంచేసుకుంటే తెగిపోయేది కాదని, విడాకులు అనేవి ఇద్దరి మనుషుల్నిభౌతికంగా వేరుచేసినా మనసుల్లో మాత్రం ఆ జ్ఙాపకాలు చెరగవని, ఒక్కసారి వద్దనుకుంటే తెగిపోయేది కాదు వివాహ బంధమని, ఎన్ని జన్మలెత్తినా భార్య స్థానం భార్యదేనని చాలా ఎమోషనల్‌గా చెప్తున్నాడు దర్శకుడు సూర్య కిరణ్. బిగ్ బాస్ హౌస్‌ని బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ ఇంటి పరిస్థితులతో పాటు తన పర్శనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన.. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2016లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కళ్యాణి తన లైఫ్‌లో లేకపోవడం తీరని లోటే అంటూ భావోద్వేగానికి గురయ్యారు దర్శకుడు సూర్యకిరణ్. కళ్యాణి గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఆమె అవసరం తనకు ఇప్పటికీ ఉందన్నారు. నా ఫోన్, ఐపాడ్‌లో అన్నీ కళ్యాణి గారి ఫొటోలే ఉండటాన్ని చూసిన మా అమ్మ సిగ్గులేదురా.. ఇంకా.. ఆమె ఫొటోలు పెట్టుకున్నావ్ అని తిట్టినా కళ్యాణి అంటే తనకు ఇష్టమన్నారు. ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు దర్శకుడు సూర్య కిరణ్.