Homeఫ్లాష్ ఫ్లాష్SURYA KUMAR YADAV;ఐసీసీ మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మిస్టర్‌ 360...

SURYA KUMAR YADAV;ఐసీసీ మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మిస్టర్‌ 360 సూర్యకుమార్ యాదవ్

SURYA KUMAR YADAV:

భారత విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్(SURYA KUMAR YADAV) 2022 సంవత్సారానికి గాను ఐసీసీ పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్థానం సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డెలకెక్కాడు. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ సామ్ కుర్రాన్, పాకిస్తానీ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా కూడా ఈ ఐసీసీ టైటిల్ కోసం పోటీ పడిన వారిలో ఉన్నారు. 2022 తనకు ఎంతో అద్భుతమైనదని, టీ20 మ్యాచులను ఎంతో ఆస్వాదిస్తూ ఆడినట్లు సూర్య కుమార్‌ చెప్పారు.

అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత సూర్యకుమార్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. రికార్డుల శ్రేణులను బద్దలు కొడుతున్న ఈ బ్యాట్స్‌మెన్‌ టీ 20 ఫార్మాట్‌లో మునుపెన్నడూ లేని విధంగా బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు. అతను టీ20 లలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడు. 31 మ్యాచ్‌లలో 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2022 సంవత్సరాన్ని ముగించాడు. వీటిలో 68 సిక్సర్లతో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం.

మిండియా మిస్టర్‌ 360 గా పేరుగాంచిన సూర్యకుమార్‌ యాదవ్‌ (SURYA KUMAR YADAV) కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. ఐసీసీ మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్‌ చరిత్ర సృష్టించారు. ఈ అవార్డు తనను వరించడంతో గొప్ప అనుభూతి పొందుతున్నానని సూర్య కుమార్‌ యాదవ్‌ (SURYA KUMAR YADAV) చెప్పారు.

Recent

- Advertisment -spot_img