Homeహైదరాబాద్latest NewsSurya : ''రెట్రో'' మూవీకి దూరంగా సూర్య.. కారణం అదేనా..?

Surya : ”రెట్రో” మూవీకి దూరంగా సూర్య.. కారణం అదేనా..?

Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) ప్రస్తుతం వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు. ఇటీవలే పాన్ ఇండియా సినిమా అని ”కంగువ” అనే సినిమా చేసాడు. తీరా ఆ సినిమా విడుదలైక అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ”కంగువ” సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా సూర్య అది ప్లాప్ కావడంతో డీలా పడిపోయాడు. ఈ నేపథ్యంలో సూర్య ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ”రెట్రో” అనే సినిమాలో నటించాడు.ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ”రెట్రో” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా మే 1న రిలీజ్ అవుతున్న సూర్య మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. హీరోయిన్ పూజా మాత్రమే అన్ని భాషల్లో సినిమాని ప్రమోట్ చేస్తుంది. తెలుగులో వరుసగా పూజా ప్రొమోషన్స్ చేస్తుంది. కానీ సూర్య మాత్రం సినిమా ప్రొమోషన్స్ కు దూరంగా ఉన్నాడు. అందుకు కారణం ”కంగువ” సినిమానే అని కొందరు అంటున్నారు. ఆ సినిమా కారణంగా సూర్య ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఈ క్రమంలో సూర్య పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే మళ్ళీ మీడియా ముందుకు వస్తే వారు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలని సూర్య అసలు బయటికి రావడం లేదుని సమాచారం. మరి సూర్య ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడో లేదు చూడాలి.

Recent

- Advertisment -spot_img