Surya : సూర్య హీరోగా నటించిన సినిమా ”రెట్రో” మే 1న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా నిన్న చెన్నైలో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్య, శివకుమార్, కార్తీక్ సుబ్బరాజ్, పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్ సూర్యను గురించి భావోద్వేగంతో మాట్లాడారు. శివకుమార్ మాట్లాడతూ.. రెట్రో సినిమా చాలా బాగా వచ్చింది. మీ మద్దతుతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు.కోలీవుడ్‌లో సిక్స్ ప్యాక్‌ను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తిగా సూర్యను ప్రశంసించారు.. “వారణం ఆయిరం” కోసం సిక్స్ ప్యాక్ లుక్‌ను సాధించిన మొదటి తమిళ నటుడిగా సూర్య పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అతని ఫిట్‌నెస్ మరియు శరీర ఆకృతి అభిమానులను ఆకర్షించాయి అని అన్నారు.
అలాగే తన కొడుకు పెద్ద హీరో అవుతాడని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు అని తెలిపారు. సూర్యకు 17 ఏళ్ల వయసులో నేను ఒక జ్యోతిష్కుడిని కలిశాను. సూర్య ఇండస్ట్రీలో పెద్ద పేరు ఎదుగుతాడని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. ఇది విన్నప్పుడు నేను నిజంగా నమ్మలేదు. అయితే ఆ తరువాత సూర్య తమిళనాడులో ఒక పెద్ద స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.