Surya : తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఓ కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో మే 19న అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, సినిమా ఓపెనింగ్‌కు క్లాప్ కొట్టి శుభారంభం చేశారు.
వెంకీ అట్లూరి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా మారుతి కారు చరిత్ర ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని టాక్. సూర్య ఫ్యాన్స్‌తో పాటు తెలుగు, తమిళ సినిమా ప్రియులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అసూర్య వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి సినిమాతో సూర్య హిట్టు కొడతాడో లేదో చూడాలి.