Homeసినిమాడ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్‌

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్‌

ముంబాయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. విచారణలో రియా 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు బ‌య‌ట‌పెట్టింది. సుశాంత్ మృతి కేసు విచార‌ణ సంద‌ర్భంగా డ్ర‌గ్స్ కేసు వెలుగు చూసింది. ఇదే కేసులో రియా సోదరుడు షోవిక్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. రియా సూచనల మేరకు సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని షోవిక్‌ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్‌సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులోంచి కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. అలాగే డ్రగ్స్‌ స్మగ్లర్ బాసిత్‌ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో ఆమె అరెస్టుల‌కు రంగం సిద్ధ‌మైంది. రియా వెల్లడించిన సినీ ప్రముఖులకు కూడా త్వరలో ఎన్‌సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img