Homeక్రైంసుశాంత్‌ను విషం పెట్టి చంపారు

సుశాంత్‌ను విషం పెట్టి చంపారు

న్యూఢిల్లీః బాలివుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను విషం పెట్టి చంపారేమోన‌ని అనుమానంగా ఉంద‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి త‌న ట్విట‌ర్ అకౌంట్లో చేసిన పోస్టింగ్‌లో అనుమానం వ్య‌క్తం చేశారు. పోస్టుమార్టం నివేదిక‌ల్లో విష ప్ర‌యోగ ఆన‌వాళ్లు క‌న్పించ‌కుండా ఉద్దేశ పూర్వ‌కంగానే పోస్టుమార్టం ఆల‌స్యంగా చేసిన‌ట్టు క‌న్పిస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పోస్టు మార్టం గ‌దిలో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌భ‌ర్తీ 45 నిమిషాలు ఎలాంటి అనుమ‌తి లేకుండా గ‌డిపిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో స్వామి వ్యాఖ్య‌లు ఆస‌క్తి రేపుతున్నాయి. సుశాంత్ మ‌ర‌ణించిన అనంత‌రం సుమారు 10-12 గంట‌లు ఆల‌స్యంగా పోస్టుమార్టం నిర్వ‌హించ‌డం, ఫోరెన్సిక్ నివేదిక‌ల్లోనూ ఎలాంటి స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం కూడా ప‌లు ఊహాగానాల‌కు తావిస్తోంది. సుశాంత్ కేసును సుప్రీం కోర్టు ఆదేశం ప్ర‌కారం సీబీఐ ధ‌ర్యాప్తు చేస్తున్న విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img