Homeహైదరాబాద్latest NewsSuspended DSP Praneeth Rao కేసు సిట్​కు బదిలీ

Suspended DSP Praneeth Rao కేసు సిట్​కు బదిలీ

– విచారణ అధికారిగా జూబ్లీహిల్స్​ ఏసీపీ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును మంగళవారం సిరిసిల్ల రాజన్న జిల్లాలో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు అదే రోజు రాత్రి ప్రణీత్ రావును హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ప్రణీత్ రావు కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్​ టీమ్(సిట్)కు బదిలీ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ప్రణీత్ రావు కేసు విచారణ అధికారిగా జూబ్లీహిల్స్ ఏసీపీని ఉన్నతాధికారులు నియమించారు. ప్రణీత్ రావును పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. స్టేట్​ మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ప్రత్యేక పోలీస్ టీమ్​ ప్రణీత్ రావును రిమాండ్​కు తరలించనున్నట్లు సమాచారం. ఎస్​ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్​ రావుతో పాటు మరికొంత మంది మాజీ ఇంటెలిజెన్స్​ అధికారుల మెడకు ఈ కేసు చుట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే ఈ కేసు ఇన్వెస్టిగేషన్​ సాగనుందని పోలీస్ డిపార్ట్​మెంట్​లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img