Homeహైదరాబాద్latest Newsగచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా...

గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానం.?.

ఇదేనిజం, శేరిలింగంపల్లి: హైదరాబాద్ గచ్చిబౌలి లోని రెడ్ స్టోన్ హోటల్లో  నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.  జడ్చర్లకు చెందిన శృతి నగరంలో ఓ ఆసుపత్రిలో నర్సింగ్ జాబ్ చేస్తున్నది. కాగా శృతి  నలుగురి స్నేహితులు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఆదివారం రాత్రి డిన్నర్ కోసం కలిసి రెడ్ స్టోన్ హోటల్ కు వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున 3.30 గం ల సమయంలో శృతి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందిందింది. మృతురాలి గదిలో చూడగా మృతురాలి వంటిపై గాయాలతో పాటు గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్ పడి ఉండటంతో ఆమె మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఆమెపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి ఇద్దరు నిందితులను అదుపులోకి పోలీసులుతీసుకున్నట్లు సమాచారం.పోలీసులు సీసీ పుటేజిని ఆధారంగా చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img