ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈ రోజు ఉదయం దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన నల్ల మల్లేష్ (35) అను అతడు ధర్మపురి పట్టణ కేంద్రంలో మేస్త్రి పని చేసుకుంటూ తల్లితో జీవిస్తున్నాడు. గత 6 సంవత్సరాల క్రితం భార్యకు విడాకులు ఇచ్చి మద్యానికి బానిసై త్రాగి ఎక్కడపడితే అక్కడ పడుకునేవాడు. యధావిధిగా నిన్న రాత్రి మద్యం తాగి కమలాపూర్ చౌరస్తాలో రాత్రి పడుకున్నాడు. అతిగా మద్యం సేవించడం వలన నిద్రలో చనిపోయాడు. మృతుడి తల్లి నల్ల పోషవ్వ ఫిర్యాదు మేరకు నూతన క్రిమినల్ లా భారతీయ నాగరిక్ సురక్ష సన్హిత ప్రకారం సెక్షన్ 194 ప్రకారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ధర్మపురి ఎస్సై తెలిపారు. కొత్త చట్టంలో ఇదే మొదటి కేసు అని ఆయన అన్నారు.