Homeహైదరాబాద్latest Newsకేజ్రీవాల్ ఇంటికి పోలీసులు

కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు

ఆప్ ఎంపీ స్వాతీమాల్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుులు దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. ఆధారాల కోసం కేజ్రీవాల్ డ్రాయింగ్ రూంను పూర్తిగా మ్యాపింగ్ చేశారు. స్వాతీమాల్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ ముగిసిన తరువాత ఆమెను పోలీసులు పంపించారు. మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రిని ఇరికించేందుకు బీజేపీ కుట్రపన్నుతున్నట్లు ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు. అపాయింట్‌మెంట్ లేకుండానే సీఎం ఇంటికి స్వాతీమాల్ వచ్చారని ఆప్ మంత్రి ఆతిషీ తెలిపారు.

అసలు ఏం జరిగింది?

ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి నిన్న (మే 17) వెళ్లారు. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ కూడా అక్కడే ఉన్నారు. మాట్లాడుతుండగానే బిభవ్ తనను విచక్షణా రహితంగా కొట్టాడని స్వాతీమాల్ పేర్కొంది. సున్నితమైన భాగాలపైన పలుమార్లు తన్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Recent

- Advertisment -spot_img