Homeహైదరాబాద్latest Newsరైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇకపై ప్రతి రైల్​లో..!

రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇకపై ప్రతి రైల్​లో..!

రైల్వే ప్రయాణానికి కొద్దిరోజుల ముందు రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నించినా.. టిక్కెట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అయితే కొంత మంది మాత్రం ఆర్‌ఏసీ టిక్కెట్‌లను ఎలాగోలా పొందుతున్నారు. దీనినే రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ అంటారు. ఒక బెర్త్‌ను ఇద్దరు పంచుకోవాలి. అయితే ఫుల్ టికెట్ కోసం డబ్బులు వసూలు చేస్తారు. నిబంధనల ప్రకారం చేస్తామని అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు ఏసీ కోచ్‌లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే వారికి పూర్తి బెడ్ రోల్ కిట్ ఇవ్వకపోవడమే అందుకు కారణం. అయితే ఇక నుంచి RAC ప్రయాణీకులకు కూడా పూర్తి బెడ్ రోల్ కిట్ ఇవ్వబడుతుంది. ఈ మేరకు రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఫుల్ టికెట్ డబ్బులు తీసుకోవడంతో పాటు బెడ్ రోల్ కిట్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. కలిపి టిక్కెట్ ధర ఉంది. అందుకే కంప్లీట్ బెడ్ రోల్ కిట్ ఇవ్వాలని నిర్ణయించారు. భారతీయ రైల్వే కూడా స్లీపర్ బోగీల సంఖ్య తగ్గించి ఏసీ బోగీల సంఖ్య, ముఖ్యంగా థర్డ్ ఏసీ బోగీల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. దీనిపై విమర్శలు వస్తుండటంతో ఇప్పుడు స్లీపర్ బోగీలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ప్రతి రైలుకు ఇకనుంచి నాలుగు జనరల్ బోగీలు ఉండేలా చూస్తోంది. ఇప్పటివరకు ముందు ఒకటి, వెనక ఒకటి జనరల్ బోగీ ఉండేది. ప్రయాణికులు వీటిల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారికైతే నరకం కనపడుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే కొత్తగా ఎల్ హెచ్ బీ బోగీలను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే రెండు సంవత్సరాల్లో దాదాపు అన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు నాలుగు జనరల్ బోగీలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img