తెలంగాణలోని రైతన్నలకు రాష్ట్ర సర్కారు గుడ్‌న్యూస్‌ను ప్రకటించింది. ఇప్పటికే సన్నధాన్యం కొనుగోళ్లపై బోనస్ అందిస్తున్న సర్కారు తాజాగా మరో తీపి కబురు చెప్పింది. రైతులందరూ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం నిధులను సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత సర్కారు రైతు బంధు పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడిందనే విమర్శల నేపథ్యంలో అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.