టాలీవుడ్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే అనుష్కకు ఈమధ్య ఒక భారీ ఆఫర్ రాగా దాన్ని సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ భారీ సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా అనుకున్నారు. హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేకపోవడంతో 5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పిన దర్శక నిర్మాతలకు అనుష్క నో చెప్పేసింది.