ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ పట్టణానికి చెందిన జన సముద్రం జర్నలిస్ట్ అజ్మతుల్లా మంగళవారం రాత్రి అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గాదె గిరిధర్ రావు, ప్రెసిడెంట్ వైయస్ కరుణాకర్ బుధవారం అజ్మతుల్లా పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నివాళి అర్పిస్తు సయ్యద్ అజ్మతుల్లా మరణం పత్రికా రంగానికి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.