జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో భారత జట్టులోకి దూసుకెళ్లిన రింకూ సింగ్.. భారత జట్టులోను ఫినిషర్‌గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. దాంతో టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో ఉంటాడని అందరూ అనుకున్నారు. ఇది చూస్తుంటే.. వన్డే ప్రపంచకప్ 2019 ముందు అంబటి రాయుడిని తప్పించిన పరిస్థితులను తలపించింది. అప్పట్లో రాయుడిని సైతం నాలుగో స్థానంలో ఏడాది మొత్తం భారత జట్టుకి ఆడించి.. ఐపీఎల్ 2019లో విఫలమయ్యాడని చివరి నిమిషయంలో 2019 ప్రపంచకప్ జట్టులో చోటివ్వలేదు. రింకూ సింగ్‌లానే స్టాండ్‌బై లిస్ట్‌లో చేర్చారు. రాయుడికి బదులు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తాడని విజయ్ శంకర్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ 2024లో రింకూ సింగ్ ప్రదర్శన ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయుడిలా రింకూ సింగ్ కూడా బౌలింగ్ చేయలేనని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.