టీ20 ప్రపంచకప్-2024 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీని USA-వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై దేశాలు పోటీ పడుతున్నాయి. టైటిల్ గెలవడమే లక్ష్యంగా యూఎస్ఏలో అడుగుపెట్టిన భారత్.. టోర్నీలో హాట్ ఫేవరెట్ ఉంది. అయితే త్వరలో జరగబోతున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నేపథ్యంలో భారత్ రెండు రకాల జెర్సీలను ధరించబోతోంది. నార్మల్ మ్యాచ్‌లలో ఒక స్టార్.. టోర్నీ మ్యాచ్‌లలో మూడు స్టార్ల ఉన్న జెర్సీని ధరిస్తుంది. అందులో ఒక స్టార్ టీ20 ప్రపంచ కప్ 2007 విజయాన్ని.. మూడు స్టార్లు అన్ని ఫార్మాట్లలో ప్రపంచకప్ విజయాల (టీ20 వరల్డ్‌కప్ 2007, వన్డే వరల్డ్‌కప్‌లు 1983,2011)ను సూచిస్తాయి.