జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మరో నెలలోఈ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఏ దేశానికి ఎన్ని ట్రోఫీలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం… అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకున్న జట్లుగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ నిలిచాయి. అయితే 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ ట్రోఫీని ఆరుసార్లు గెలిచిన ఆస్ట్రేలియా మాత్రం ఒక్కసారి మాత్రమే టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక కూడా ఒక్కసారి మాత్రమే టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2016లో భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు వెస్టిండీస్ రెండవ ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకుంది.