Homeహైదరాబాద్latest NewsT20 World Cup-2024: సూపర్-8 మ్యాచ్‌ల ఫుల్ షెడ్యూల్..? టీమిండియా మ్యాచ్‌ల టైమింగ్స్ ఏంటి? రాత్రంతా...

T20 World Cup-2024: సూపర్-8 మ్యాచ్‌ల ఫుల్ షెడ్యూల్..? టీమిండియా మ్యాచ్‌ల టైమింగ్స్ ఏంటి? రాత్రంతా మేల్కోవాలా?

టీ20 వరల్డ్ కప్-2024 లీగ్ దశ క్లైమాక్స్‌కు వచ్చేసింది. నేపాల్‌పై బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించడంతో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, అమెరికా; గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్; గ్రూప్-సీ నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తదుపరి దశకు అర్హత సాధించాయి. ఈ ఎనిమిది జట్లను ముందుగా నిర్ణయించిన సీడింగ్ ద్వారా రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా, ఇంగ్లండ్ నిలిచాయి. టీమిండియా మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకే మొదలవుతాయి.
సూపర్-8 పూర్తి షెడ్యూల్
జూన్ 19: అమెరికా వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 20: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (లూసియా- ఉదయం 6 గంటలకు)
జూన్ 20: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 21: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (బార్బడోస్- ఉదయం 6 గంటలకు)
జూన్ 21: ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లూసియా- రాత్రి 8 గంటలకు)
జూన్ 22: అమెరికా వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్- ఉదయం 6 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 23: అఫ్గానిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (విన్సెంట్- ఉదయం 6 గంటలకు)
జూన్ 23: అమెరికా వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 24: వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా- రాత్రి 6 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లూసియా- రాత్రి 8 గంటలకు)
జూన్ 25: అఫ్గానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (విన్సెంట్- ఉదయం 6 గంటలకు).

Recent

- Advertisment -spot_img