టీ20 ప్రపంచకప్ 2024 మరో 25 రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహా పోరులో 20 జట్లు తలపడనున్నాయి. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు పోటీపడతాయి. మరోవైపు ఈ మెగాటోర్నీలో పాల్గొనే తమ జట్లను అన్ని దేశాలు క్రమంగా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగాండా ప్రకటించిన జట్టు ఆసక్తిగా మారింది. 43 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా జట్టులోకి వచ్చాడు. తుది జట్టులోకి వస్తే టీ20 ప్రపంచకప్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఉగాండా క్రికెట్ అసోసియేషన్ 15 మందితో కూడిన జట్టును నిన్న ప్రకటించింది. మెగాటోర్నీలో ఉగాండాకు బ్రియాన్ మసాబా నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా రియాజత్ అలీషా ఎంపికయ్యారు.
ఉగాండా జట్టు: బ్రియాన్ మసాబా (కెప్టెన్), రియాజత్ అలీ షా, కెన్నెత్ వైస్వా, దినేశ్ నక్రాని, ఫ్రాంక్ సుబుగా, రోనక్ పటేల్, రోజర్ ముకాసా, కోస్మాస్ క్యెవుటా, బిలాల్ హసున్, ఫ్రెడ్ అచెలమ్, రాబిన్సన్ ఒబుయా, సిమోన్ సెసాజి, హెన్నీ సెన్యోండో, అల్పేష్ రాజ్‌మణి, జుమా మియాజి.