Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup 2024: ఫైనల్కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారంటే?

T20 World Cup 2024: ఫైనల్కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారంటే?

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ రేపు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టైటిల్ పోరుకు ముందు క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. జూన్ 29న బార్బడోస్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా? వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
టీ20 ప్రపంచకప్‌లో ఈ టైటిల్ మ్యాచ్ కోసం ICC ఒక రోజును రిజర్వ్ డే ఉంది. జూన్ 29న మ్యాచ్ పూర్తి కాకపోతే జూన్ 30న ట్రోఫీ కోసం ఇరు జట్లు తలపడనున్నాయి. అటియే రిజర్వ్ డే లోనూ వర్షం పడే సూచన ఉందా?. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ రద్దైతే టైటిల్ ఎవరు గెలుస్తారు? రిజర్వ్ రోజున కూడా ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ పూర్తి కాకపోతే, రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా నిలిచాయి.

Recent

- Advertisment -spot_img