పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీని టీ20 ప్రపంచకప్-2024 బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ఐసీసీ తెలిపింది. ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్లుగా యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్ నియమితులైన సంగతి తెలిసిందే. కాగా, మరో వారం రోజుల్లో టీ20 డబ్ల్యూసీ ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.