Homeహైదరాబాద్latest NewsT20 World Cup-2024: తొలిసారి ఫైనల్‌ కు దక్షిణాఫ్రికా.. చరిత్రాత్మక విజయం..

T20 World Cup-2024: తొలిసారి ఫైనల్‌ కు దక్షిణాఫ్రికా.. చరిత్రాత్మక విజయం..

దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ట్రినిడాడ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. గత వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో ఒక్కసారి కూడా సఫారీ సేన టైటిల్‌ పోరుకు చేరుకోలేదు.
టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీస్‌ పోరులో ఘన విజయం సాధించింది. 57 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ డికాక్‌ (5) నిరాశపరిచినా హెండ్రిక్స్‌(29), మార్‌క్రమ్‌ (23) రాణించారు. ఈరోజు రాత్రి ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్ మ్యాచ్‌లో విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడనుంది.

Recent

- Advertisment -spot_img