జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా టీం కి మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ సంచలనం ఫ్రేజర్ మెక్‌గర్క్‌కు జట్టులో చోటు దక్కలేదు. కొందరు సీనియర్లకు జట్టులో చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్ జట్టులో స్టీవెన్ స్మిత్‌కు చోటు దక్కలేదు. మాట్ షార్ట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్ మరియు జేవియర్ బార్ట్‌లెట్ కూడా ఔట్ అయ్యారు.
ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు: మిచెల్ మార్ష్ (కేప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.