Homeహైదరాబాద్latest NewsT20 World Cup-2024: సూపర్-8 మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా రద్దయితే భారత్ పరిస్థితేంటి?

T20 World Cup-2024: సూపర్-8 మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా రద్దయితే భారత్ పరిస్థితేంటి?

టీ20 ప్రపంచకప్-2024లో నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పోరుల్లో వరుణుడు తన ప్రతాపం చూపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు క్రికెట్ అభిమానులను వేధిస్తున్నాయి. సూపర్-8 మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉందా? లేదా? అన్ని మ్యాచ్‌లు రద్దు చేయబడితే? సెమీ-ఫైనల్‌కు ఏ జట్లు అర్హత సాధించాలో ICC ఎలా నిర్ణయిస్తుంది? అనే సందేహాలు అభిమానులకు వస్తున్నాయి. లీగ్ దశలో అర్హత సాధించిన ఎనిమిది జట్లను సూపర్-8లో రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్; అలాగే గ్రూప్-2లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా ఉన్నాయి. ఆయా గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా ఫేవరెట్ జట్లుగా ఉన్నాయి. వరుణుడు అడ్డుకాకపోవడంతో ఇరు జట్లు సులువుగా సెమీస్‌కు చేరుకోనున్నాయి.
సూపర్-8 మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డేని కేటాయించలేదు. అందువల్ల వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది. వరుణుడు కారణంగా భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ రద్దయితే మూడు పాయింట్లు దక్కుతాయి. గ్రూప్-1లో ఒక జట్టు (ఆస్ట్రేలియా) మినహా మిగతా జట్లు మూడు పాయింట్ల కంటే తక్కువ స్కోర్ చేస్తే భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆసీస్‌తో కలిసి సెమీస్‌కు చేరుతుంది. కానీ అలా జరగడం దాదాపు అసాధ్యమే. ఆఫ్ఘనిస్థాన్ లేదా బంగ్లాదేశ్ కూడా మూడు పాయింట్లు సాధిస్తే నెట్‌రూన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. వర్షం కారణంగా అన్ని మ్యాచ్‌లు రద్దు కావడంతో టీమ్ ఇండియాకు రన్ రేట్ (0) ఉంటె. ఈ సందర్భంలో, బంగ్లాదేశ్ లేదా ఆఫ్ఘనిస్తాన్ సానుకూల నెట్‌రన్ రేట్ కలిగి ఉంటే ఆ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు నిరాశ తప్పదు. బంగ్లాదేశ్ లేదా ఆఫ్ఘనిస్తాన్ కూడా జీరో నెట్ రన్ రేట్ కలిగి ఉంటే టీ20 ర్యాంకింగ్స్ లేదా హెడ్ టు హెడ్ మ్యాచ్‌ల ఆధారంగా మెరుగైన రికార్డు ఉన్న జట్టుకు అవకాశం ఇవ్వబడుతుంది. మే 31 నాటికి టీ20 ర్యాంకింగ్స్ మాత్రమే పరిగణించబడతాయి. ఈ పరిస్థితిలో భారత్ లాభపడుతుంది.

Recent

- Advertisment -spot_img