Homeహైదరాబాద్latest NewsT20 World Cup 2024: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగేనా? వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటి?

T20 World Cup 2024: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగేనా? వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటి?

T20 వరల్డ్‌కప్ 2024లో రోహిత్ సేన సూపర్-8 స్టేజీలోని చివరి మ్యాచ్ ఆడనుంది. గ్రాస్‌ ఐలెట్‌‌లోని డారెన్ సామీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ఈ మ్యాచ్ జరగనుంది. గ్రాస్‌ ఐలెట్‌‌లో వాతావరణాన్ని బట్టి చూస్తే మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి వర్షం పడే అవకాశముంది. అయితే నేటి మ్యాచ్ ఆస్ట్రేలియాకు చావోరేవో లాంటిదనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ రేసులో ఆస్ట్రేలియా ఉంటుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. అయితే విజయం సాధించినప్పటికీ ఆసీస్ సెమీస్ ఆశలకు నెట్‌రన్ రేట్ చాలా కీలకం.
అంతేగాక మధ్యాహ్నం కూడా వరుణుడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యాచ్ సజావుగా సాగే పరిస్థితులూ లేవు. ఇరు జట్లు కనీసం అయిదు ఓవర్లు కూడా ఆడే పరిస్థితి లేకపోతే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు. అలా జరిగితే భారత్ అయిదు పాయింట్లతో గ్రూప్-1 టేబుల్ టాపర్‌‌గా సెమీఫైనల్‌కు చేరుతుంది.

Recent

- Advertisment -spot_img