ఇటీవలే బీసీసీఐ కీలక నిర్ణయం తీసికుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ఆటగాళ్లు అందరు దేశవాళీల్లో ఆడాలని రూల్స్ తెచ్చింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడే క్రికెటర్ల రెమ్యునరేషన్ కూడా పెంచింది. అలాగే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని వారు దేశవాళీ, రంజీల్లో ఆడకపోతే సీరియస్ యాక్షన్ తప్పదని క్రికెటర్లను హెచ్చరించింది. ఇదే విషయంలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ సీరియస్ అయింది. తమ సూచనలను లెక్క చేయనందుకు వీరి సెంట్రల్ కాంట్రాక్టులను తొలగించింది. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటితేనే మళ్లీ సెలక్షన్‌కు దారులు తెరచుకుంటాయని ప్రకటించింది.
అయితే ఐపీఎల్లో సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ సెలక్షన్ రేసులోకి రావాలని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ భావిస్తున్నారు. ఈ విషయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ దూసుకెళ్తున్నాడు. టీ20 క్రికెట్లో ఏ జట్టుకైనా ఇషాన్ కిషన్ పెద్ద అసెట్. అయితే ఐపీఎల్ తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతడు సెలక్ట్ అయ్యే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ కప్ ఓపెనింగ్ బ్యాటర్స్ రేసులో గట్టి పోటీ ఉంది. ఓపెనర్ పొజిషన్‌కు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ పోటీ పడుతున్నారు. వికెట్ కీపింగ్‌లో కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ లేదా శాంసన్ శాంసన్ ముగ్గురూ ఇషాన్ కంటే ముందున్నారు. ఈ లెక్కన చూస్తే.. అతడు లీగ్ మొత్తం మంచి బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తో సత్తా చాటితేనే.. సెలక్టర్ల దృష్టిలో పడవచ్చు.