2024 టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోన్న అమెరికా, వెస్టిండీస్‌ల పిచ్‌లు నెమ్మదిగా ఉన్నాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ వికెట్ల పై 140 నుంచి 150 పరుగులు చేయడం గొప్పేనని రోహిత్ శర్మ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఇవాళ ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ పిచ్‌లు నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో 140 పరుగులు చేసినా కాపాడుకోవచ్చని రోహిత్ తెలిపాడు. అక్కడ ‘140-150 పరుగులు కూడా మంచి స్కోరు. ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయకూడదని.. తాజాగా ఆ జట్టు పాకిస్థాన్‌ను ఓడించిందని రోహిత్ శర్మ అన్నాడు. మేము ఐర్లాండ్‌ను బలమైన జట్టుగానే చూస్తాము. బ్యాట్స్‌మెన్ ఈ పిచ్‌ల పరుగుల కోసం దూకుడుగా ఉండవద్దని రోహిత్ శర్మ అన్నాడు.